ఘనంగా ఆది హనుమాన్ రథోత్సవం

NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఆది హనుమాన్ దేవాలయములో శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా, భక్తి శ్రద్ధలతో భాజా భజంత్రీలతో రథోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అర్చకులు జగదీశ్వర్, చంద్రశేఖర్, ఆలయ కమిటీ ఛైర్మన్ బాల్ రెడ్డి పాల్గొన్నారు.