పాడుబడ్డ బస్ షెల్టర్‌కు కొత్త రూపు

పాడుబడ్డ బస్ షెల్టర్‌కు కొత్త రూపు

NRPT: ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం స్టేజ్ వద్ద ఉన్న బస్ షెల్టర్‌ను నూతన సర్పంచ్ వెంకటేష్ చొరవతో సుందరంగా తీర్చిదిద్దారు. గతంలో పాడుబడి శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు ఎండా - వానలకు రక్షణ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సర్పంచ్ ప్రత్యేక దృష్టి సారించి మరమ్మతులు చేయించి, రంగులు వేయించి షెల్టర్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు.