రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

NTR: గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో, మోకసాకలవపూడి రైల్వే స్టేషన్ గేట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి గురువారం రాత్రి రైలు ప్రమాదంలో మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు ఎరుపు, ఆకుపచ్చ పూల డిజైన్ గల నలుపు లుంగీ, తెలుపు, పసుపు గీతలున్న నలుపు కండువా ధరించి ఉన్నాడన్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు గుడివాడ రైల్వే పోలీసులకు తెలియజేయాలని కోరారు.