11 నెలలుగా అందని స్టైపెండ్లు
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్ పరిధిలో ఇంటర్న్ షిప్ చేస్తున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌కు ఉపకార వేతనాలు ఆలస్యమవుతున్నాయి. గత ఏడాది జూన్‌లో ప్రారంభించిన 12 మంది విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.5 వేల చొప్పున ఇవ్వాల్సిన స్టైపెండ్లు 11 నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.