VIDEO: విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంపొందించుకోవాలి: కలెక్టర్
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ బుధవారం రాజంపేట మండలం కొండాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి,10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఎస్.ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.