రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు సిర్గాపూర్ విద్యార్థి ఎంపిక
SRD: SGF రాష్ట్రస్థాయి రెజ్లింగ్ క్రీడా పోటీలకు సిర్గాపూర్ హై స్కూల్ విద్యార్థి ఎంపికైనట్లు MEO నాగారం శ్రీనివాస్, PD సంతోష్ కుమార్ తెలిపారు. నిజాంపేటలో సోమవారం జరిగిన ఉమ్మడి జిల్లా ఛాంపియన్‌షిప్ రెజ్లింగ్ (38KG) ఫ్రీ స్టైల్ విభాగంలో టెన్త్ విద్యార్థి గోకుల్ కృష్ణ మొదటి బహుమతి గోల్డ్ మెడల్ గెలుపొంది రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌కు ఎంపికైనట్లు తెలిపారు.