మణుగూరులో పట్టపగలే ఎద్దులు చోరీ

మణుగూరులో పట్టపగలే ఎద్దులు చోరీ

BDK: మణుగూరు మండలంలో దొంగలు హల్చల్ సృష్టించారు. మండలంలోని అన్నారం గ్రామంలో రెండు ఎద్దులను పట్టపగలే చోరీ చేశారు. ట్రాలీ ఆటో తీసుకువచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాటిని ట్రాలీలో ఎక్కించుకొని పరారయ్యారు. తీరా కుటుంబ సభ్యులు సాయంత్రం వచ్చేసరికి ఎద్దులు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.