కలెక్టరేట్‌లో ఘనంగా భగీరథ జయంతి
NRML: నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం మహర్షి భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. అధికారులు, నాయకులు భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎల్డిఎం రామ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.