అథ్లెట్స్‌ను అభినందించిన కలెక్టర్

WNP: హన్మకొండ జవహర్ లాల్ స్టేడియంలో ఈ నెల 3, 4 తేదీలలో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్, జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు కిడ్స్ జావేలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ సురభి సోమవారం వనపర్తిలో సన్మానించి అభినందించారు.