భవానీ దీక్షల విరమణకు పటిష్ట బందోబస్తు
NTR: భవానీ దీక్షల విరమణ 11–15 డిసెంబర్ ఉన్న సందర్భంగా జిల్లా CP ఎస్.వీ. రాజ శేఖర బాబు ఇంద్రకీలాద్రి పరిసరాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. డ్రోన్ వీడియోలు, అధికారులకు బ్రీఫింగ్, 12 కాంపోనెంట్లు, 71 సెక్టార్లు, మొత్తం 4129 మంది సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పటు చేశారు. జేబు & గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలు ఉన్నాయని తెలిపారు.