కారుమూరి ఒత్తిడితోనే హత్య కేసు పక్కదోవ: ఎమ్మెల్యే

కారుమూరి ఒత్తిడితోనే హత్య కేసు పక్కదోవ: ఎమ్మెల్యే

W.G: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఒత్తిడితోనే ముద్దాపురం ముళ్లపూడి నాగ హారిక హత్య కేసును పోలీసులు పక్కదోవ పట్టించారని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆరోపించారు. గురువారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. హంతకురాలు రూప వైసీపీ నేత కావడంతోనే ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని చెప్పారు.