'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి'

'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి'

KNR: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో బుధవారం గ్రామ ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. ఘర్షణలను ఎవరు ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు.