ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శలు

NLR: పొదలకూరు మండలం విరువూరులో ఎద్దల ప్రసాద్ రెడ్డిని గురువారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మహ్మదాపురంలో గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త ఎండీ ఇర్షాద్ కుటుంబ సభ్యులను, పొదలకూరులో మైనార్టీ సెల్ నేత షేక్ జమీర్ బాషా కోడలు మృతి చెందిన కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించారు.