నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ప్రకాశం: పొదిలి మండలంలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఏలూరు సమీపంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని ఏలూరు, సల్లూరు, పూనూరివారిపాలెం ప్రాంతాల్లో గృహ, వ్యవసాయ, పారిశ్రామిక ఫీడర్లకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.