ఉత్తమ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి
TG: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్న తాండూరుకు చెందిన దూస శ్రీనివాస్ గుండెపోటుతో మరణించాడు. శ్రీనివాస్, ఆయన సతీమణి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇవాళ ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయాడు.