కమ్మ సంక్షేమ సంస్థ ఛైర్మన్‌ను అభినందించిన ఎమ్మెల్యే

NTR: కమ్మ సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మం చౌదరి గురువారం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా అందజేశారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాల మేరకు సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు, తదితరులు పాల్గొన్నారు.