చిన్నారి ఆరోగ్యంపై మంత్రి స్పందన
సత్యసాయి: ధర్మవరం పట్టణానికి చెందిన పేద చేనేత కార్మికుల కుమార్తె జీవిత ఆరోగ్య సమస్యపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు. బాధిత కుటుంబానికి సహాయం అందించాలని నియోజకవర్గ ఇంఛార్జి హరీష్ బాబును ఆదేశించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి, మెరుగైన వైద్య చికిత్సకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.