నాయుడుపేటలో ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీ

NLR: నాయుడుపేటలో శుక్రవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ మందిరం వద్ద నుండి బజార్ వీధి దర్గా రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశభద్రతలో భాగంగా భారత సైన్యం ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద స్థావరాలను కూల్చడం గర్వించదగ్గ విషయమన్నారు.