రాష్ట్రస్థాయి పోటీలకు కుందూరు హై స్కూల్ విద్యార్థిని ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు కుందూరు హై స్కూల్ విద్యార్థిని ఎంపిక

కోనసీమ: కె.గంగవరం మండలం కుందూరు జడ్పీ హై స్కూల్ విద్యార్థిని గుబ్బల కుందన లక్ష్మి ప్రియ రాష్ట్రస్థాయి లాంగ్ జంప్, హై జంప్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం ఆదినారాయణ ఇవాళ తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన పోటీలలో లక్ష్మీ ప్రియ లాంగ్ జంప్‌లో ప్రథమ స్థానం, హై జంప్‌లో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. బాలికను పలువురు అభినందించారు.