గాంధీ ఆసుపత్రిపై దాడి.. స్పందించిన WHO

గాంధీ ఆసుపత్రిపై దాడి.. స్పందించిన WHO

ఉత్తర టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రి లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో ఆసుపత్రి ధ్వంసమైంది. ఈ ఘటనపై WHO డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ స్పందించారు. ఆసుపత్రిపై దాడులు ఆందోళనకరమని అన్నారు. ఆరోగ్య సౌకర్యాలపై దాడులను నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. కాగా, గాంధీ ఆసుపత్రిని ఖాళీ చేయిస్తున్నామని.. మూడు ఇతర ఆసుపత్రులపై కూడా దాడులు జరిగినట్లు ఇరాన్ తెలిపింది.