అడ్డాకల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

MBNR: వార్షిక తనిఖీలలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ జానకి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సేవలపై ఏవైనా ఇబ్బందులు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన ప్రకారం సమర్థవంతంగా సేవలు అందించాలన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు.