నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో రన్ కార్యక్రమం

VSP: తలసేమియాపై అవగాహన కల్పించేందుకు విశాఖ ఆర్కే బీచ్‌లో ఇవాళ 3కె, 5కె రన్ నిర్వహించనున్నారు. శనివారం ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి నేతృత్వం వహిస్తుండగా, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి రన్‌లో పాల్గొననున్నారు. రన్ అనంతరం తమన్, సమీరా భరద్వాజ్ లీడింగ్‌లో మ్యూజికల్ నైట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.