కొత్తగూడ మండలంలో 144 సెక్షన్ అమలు
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో 144 సెక్షన్ అమల్లోకి ఉందని ఎస్సై రాజ్ కుమార్ గురువారం తెలిపారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయ నాయకులు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.