కుక్కల దాడి బాధిత చిన్నారికి అండగా ఎంపీ

కుక్కల దాడి బాధిత చిన్నారికి అండగా ఎంపీ

BHNG: వీధి కుక్కల దాడిలో కంటిచూపు కోల్పోయిన భువనగిరి చిన్నారి ప్రియాంష్‌ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి, బీబీనగర్ ఎయిమ్స్ అధికారులతో ఫోన్లో చర్చించి, బాధితుడికి మెరుగైన ఉచిత వైద్యం అందేలా చూడాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.