ఈ నెల 12న ఉచిత కంటి వైద్య శిబిరం

ఈ నెల 12న ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరులోని బీఎంఎస్ క్లబ్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం ఈనెల 12న నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ తెలిపారు. వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిబిరానికి హాజరయ్యే వారు తమ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, బ్యాంక్ పాసుపుస్తకం తీసుకుని తప్పక రావాలని సూచించారు.