బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎంపీపీ

RR: కేశంపేట మండల కేంద్రంలో చౌడమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బోనం రూపంలో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడం మన ప్రాంత ప్రజల సంస్కృతికి నిదర్శనమన్నారు.