VIDEO: ఒకే బైక్ పై నలుగురు.. ఎమ్మెల్యే మందలింపు.!
సత్యసాయి: ఒకే బైక్ పై నలుగురు ప్రయాణించడం పట్ల ఎమ్మెల్యే MS. రాజు మందలించారు. మడకశిర పట్టణ సమీపం నుంచి ఆయన అనంతపురం వెళ్తుండగా.. ఒకే ద్విచక్ర వాహనంపై నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణించడాన్ని గమనించారు. దీంతో వారిని ఆపి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అనంతరం మహిళలను తన కాన్వాయ్ వాహనంలో ఎక్కించి గమ్యస్థానానికి చేర్చారు.