'ప్రైవేట్ సంస్థలకు మాత్రమే సీఎం మద్దతునిస్తారు'
అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా పనిచేసినా, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. ధనవంతులు, ప్రైవేట్ సంస్థలకు మాత్రమే సీఎం మద్దతు ఇస్తారని ఆయన విమర్శించారు.