VIDEO: వాహన చోదకులకు సీఐ హెచ్చరికలు

VIDEO: వాహన చోదకులకు సీఐ హెచ్చరికలు

KKD: వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్-1 సీఐ నూని రమేశ్ సూచించారు. శనివారం రాత్రి కాకినాడ కల్పన సెంటర్‌లో వాహన చోదకులు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కొత్త ట్రాఫిక్ చట్టాల ప్రకారం జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు పంపిస్తామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి వెళ్లాలని సూచించారు.