కాల్పులు.. 11 మందికి గాయాలు

సౌత్ కరోలినాలో కాల్పులు కలకలం రేపాయి. లిటిల్ రివర్ ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు హారీ కౌంటీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.