రెండోసారి కరిస్తే.. కుక్కకు జీవిత ఖైదు

యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మనిషిని మొదటిసారి కరిచిన కుక్కను 10 రోజులపాటు జంతు జనన నియంత్రణ కేంద్రంలో ఉంచి.. టీకా వేసి, శరీరంలో మైక్రోచిప్‌ను అమర్చి విడుదల చేయాలని తెలిపింది. ఆ కుక్క రెండోసారి కరిస్తే దాన్ని అదే కేంద్రంలో జీవిత ఖైదుగా ఉంచాలని ప్రకటించింది. అయితే, కమిటీ సభ్యులు దర్యాప్తు చేసి కరిచినట్లు పూర్తి ఆధారాలు ఇస్తేనే జీవిత ఖైదు విధించాలని సూచించింది.