కలెక్టరేట్‌లో బసవేశ్వర జయంతి వేడుకలు
ATP: అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం బసవేశ్వర 893వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ స్వప్న పాల్గొని బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులమత రహిత సమాజం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.