బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్
KMR: అన్ని శాఖలు, బ్యాంకులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బ్యాంకర్లకు సూచించారు. ఈ మేరకు డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించి DCC/DLRC బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ రంగంలో పంట రుణాలు, టర్మ్ రుణాలు, మౌలిక సదుపాయాల రుణాల మంజూరును వేగవంతం చేయాలని ఆదేశించారు.