'చెరువులు దురాక్రమణపై అధికారులు దృష్టిసారించాలి'
CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో SC, ST విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం MRO రాము ఆధ్వర్యంలో మంగవారం జరిగింది. దళితవాడలో నెలకొన్న సమస్యలను కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. కమిటీ సభ్యులు అశోక్ మాట్లాడుతూ.. పట్టణంలోని ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేసి బోర్డులు నాటాలని కోరారు. చెరువులు దురాక్రమణపై సంబంధిత అధికారులు దృష్టిసారించాలని కోరారు.