VIDEO: మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు
మెదక్ మున్సిపాలిటీలోని 31 వార్డుల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. రెండు హాళ్లలో 11 టేబుళ్లు ఏర్పాటు చేయగా, మొత్తం మూడు రౌండ్లలో ప్రక్రియ ముగియనుంది. మొదటి రౌండ్‌లో 11 వార్డులు, రెండు, మూడవ రౌండ్లలో 10 వార్డుల చొప్పున ఫలితాలు వెల్లడిస్తారు.