రైలు ఢీకొని 18 మేకలు దుర్మరణం

రైలు ఢీకొని 18 మేకలు దుర్మరణం

HYD: షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్ పల్లి వద్ద రైలు ఢీకొని 18 మేకలు దుర్మరణం పాలయ్యాయి. ఈ ఘటన సోలిపూర్ రైల్వే బైపాస్ బ్రిడ్జ్ సమీపంలో చోటు చేసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ గ్రామానికి చెందిన గడ్డం కృష్ణయ్య యాదవ్‌కు చెందిన మేకలను వేపడం కోసం వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.