గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

NLR: కావలి మండలం తాళ్లపాలెంలో చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను, ఒక జేసీబీని మైనింగ్ అధికారులు గురువారం పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి కావలి రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అధికారులు విచారణ జరుపుతున్నారు.