'గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి'

'గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి'

SRCL: గణేష్‌ మండపాల నిర్వహకులు నియమ నిబంధనలు పాటించాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. చందుర్తి పోలీస్ స్టేషన్లో గణేష్‌ ఉత్సవ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు. గణేష్‌ మండపాల నిర్వహకులు ముందుగా పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి అనుమతులు పొందాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అసాంఘిక పాల్పడవద్దన్నారు.