మహిళా కూలీలకు అస్వస్థత

KRNL: మొక్కజొన్న పొలంలో పురుగుమందు చల్లేందుకు వెళ్లిన 9 మంది మహిళా వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం చిప్పగిరి మండలం నగరడోణ గ్రామానికి చెందిన వీరు, నేమకల్లు గ్రామంలో జాగ్రత్తలు పాటించకుండా పురుగుమందు చల్లిన తర్వాత భోజనం చేయడంతో వాంతులు చేసుకున్నారు. వీరిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.