మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్

మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్

ASF: దేశీదారు మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కాంతిలాల్ పాటిల్ మంగళవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.63 వేల విలువైన 1,050 సీసాల (90 మీ.లీ) ప్రభుత్వ నిషేధిత మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.