రాణిపేటలో సీఐ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్

TPT: గూడూరు ఒకటవ పట్టణ పీఎస్ పరిధిలోని రాణిపేటలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ డాక్టర్ పి. గీతాకుమారి ఆదేశాలతో పట్టణ సీఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో గూడూరు పట్టణ, రెండవ పట్టణం, రూరల్, చిల్లకూరు స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.