ఈనెల 27 వరకు నవోదయ దరఖాస్తు గడువు పెంపు

MDK: నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష గడువు ఈనెల 27వ తేదీ వరకు పెంచినట్లు మెదక్ జిల్లా డీఈవో రాధాకిషన్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. నవోదయ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.