పుంగనూరు పురపాలికలో బహిరంగ వేలంపాట

CTR: పుంగనూరులో కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో ఇవాళ కార్యలయంలో బహిరంగ వేలంపాట జరిగింది. మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న పబ్లిక్ యూరినల్స్ 2025-26 సంవత్సరానికి గాను రూ.5,99,000 వేలంపాట ద్వారా గుత్తేదారుడు దక్కించుకున్నాడు. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, బస్టాండులోకి వచ్చే ప్రైవేటు వాహనదారుల నుంచి ఫీజులు వసూలుకు, పబ్లిక్ యూరినల్స్ వాయిదా వేసినట్లు కమిషనర్ తెలిపారు.