నాటిన మొక్కలను సంరక్షించాలి: కలెక్టర్

ADB: నాటిన మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం సాత్నాల మండల కేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. అనంతరం సాత్నాల ప్రాజెక్టును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గేట్ ఎత్తివేసే ముందు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందజేయాలని సూచించారు.