భారీగా తగ్గిన పసుపు ధరలు

భారీగా తగ్గిన పసుపు ధరలు

GNTR: దుగ్గిరాల మార్కెట్‌లో పసుపు ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పసుపు ధర రూ. 11,000 నుంచి రూ. 11,750 వరకు పలికింది. అయితే, ఇటీవల కాలంలో ఇది రూ. 9,000 నుంచి రూ. 9,750 వరకు పడిపోయింది. ప్రస్తుతం క్వింటాల్ కనిష్ట ధర రూ. 8,800కు చేరుకోవడంతో పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు.