పాతర్లపాడులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
KMM: చింతకాని మండలం పాతర్లపాడులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.