VIDEO: నూతన గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: PMAY పథకం 2.0 కింద మంజూరు చేసిన రూ.2.50 లక్షల నిధులతో గుడివాడ 30వ వార్డు వడ్డే వారి వీధిలో నిర్మాణం పూర్తి చేసుకున్న పూరేటి వరలక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము సోమవారం పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే నూతన గృహాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని చక్కటి ఇంటిని నిర్మించారని ఎమ్మెల్యే తెలిపారు.