రుద్రంగిలో ఎస్ఎస్టీ చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన కలెక్టర్

రుద్రంగిలో ఎస్ఎస్టీ చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన కలెక్టర్

SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులో రుద్రంగి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్‌పోస్ట్‌ను ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని పకడ్బందీగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం రుద్రంగిలో ఏర్పాటు చేసిన ఆరి కేంద్రాన్ని పరిశీలించారు.