సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ
WNP: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి కర్తవ్య నిబద్ధత ప్రశంసనీయమైనదని ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరులో సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేసిన అధికారులకు సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, పూర్తి శాంతియుత వాతావరణంలో సీఎం పర్యటన జరిగిందని సహకరించిన పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.