సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్ మందు..!
అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు వేశారు. కీమోథెరపీ ఔషధం 5-ఫ్లోరోయురాసిల్ (5-Fu)ను నానోటెక్నాలజీ సాయంతో కొత్త రూపంలో రూపొందించారు. ఈ కొత్త ఔషధం పాత 5-Fu కంటే 20 వేల రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలానికి హాని చేయకుండా క్యాన్సర్ కణాలపైనే దాడి చేస్తుంది.